Business

కేవలం విమానాల కోసం లక్షల కోట్లు విడుదల చేసిన ఫ్రాన్స్

కేవలం విమానాల కోసం లక్షల కోట్లు విడుదల చేసిన ఫ్రాన్స్

కరోనా సంక్షోభంతో విలవిల లాడుతున్న విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు ఫ్రాన్స్‌ 1690 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.27 లక్షల కోట్ల) ఉద్దీపన పథకాన్ని ఫ్రాన్స్‌ ప్రకటించింది. విమానాల తయారీ దిగ్గజ సంస్థ ఎయిర్‌బస్‌తో పాటు జాతీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఫ్రాన్స్‌ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, వేల సంఖ్యలో ఉద్యోగాలు పోకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రతిగా ఆయా కంపెనీలు ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ లేదా అతితక్కువ ఉద్గారాలతో నడిచే విమానాల తయారీకి సంస్థలు మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, ఇంజిన్‌ తయారీ సంస్థలు, నిర్వహణ కాంట్రాక్టులు, విడిభాగాల సరఫరాదార్లకు కూడా ఉద్దీపన లభిస్తుంది.