నకిలీ ‘ఆరోగ్య సేతు’ యాప్ పేరుతో లింక్‌లు పంపిస్తూ పాకిస్థాన్ నేరస్థులు కొత్తరకం చౌర్యానికి తెరలేపారు. రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సమాచారం చోరీకి యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. మొబైల్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేస్తే ఫోన్‌లో ‘చాట్ మీ’ అనే యాప్ డౌన్‌లోడ్ అవుతోందని, దీని ద్వారా ఫోన్‌లో ఉన్న సమాచారమంతా వారి సర్వర్‌లో నిక్షిప్తం అవుతుందని నిఘా వర్గాలు తెలిపాయి. దీనిపై అప్రమత్తమైన తెలంగాణ మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేందర్ రెడ్డి ఉద్యోగులు అనుమానిత లింక్‌లను క్లిక్ చేయొద్దని సూచించారు. ఈ మేరకు ఆయన సర్క్యులర్ జారీ చేశారు. ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
ఆరోగ్య సేతు యాప్‌తో పాక్ సైబర్‌దాడి
Related tags :