Editorials

ధనము జీవితము భోగము మౌనము

ధనము జీవితము భోగము మౌనము

చాలా మంచి విషయాలు…

?మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని
పోగొట్టుకుంటాడు.
?వృధ్యాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బుని
పోగొట్టుకుంటారు.

?ఆరోగ్యం ఆస్తికన్నా మిన్న.
ఆరోగ్యం లేని ఆస్తి సున్నా.

?ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి.
?ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి.
?అపుడు అందరి మెప్పు పొందుతారు.

?వ్యాయామం చేయడానికి సమయ లేదూ
అనేవాళ్ళు భవిష్యత్తులో జబ్బులకు సమయం
కేటాయించ వలసి వస్తుంది.

?తిండి విషయంలో …
నాలుకను అదుపులో ఉంచుకున్నోడు యోగి,
నాలుకను అనుసరించేవాడు భోగి,
నాలుకకు బానిసైనవాడు రోగి.

?డబ్బు సంపాదించవచ్చు …
కానీ నిద్ర సంపాదించలేము.

?పుస్తకాన్ని కొనవచ్చు …
కానీ జ్ఞానాన్ని కొనలేము.

?మందులను కొనవచ్చు …
కానీ ఆరోగ్యాన్ని కొనలేము.

?పగను సంపాదించవచ్చు …
కానీ స్నేహాన్ని కొనలేము.

?ఆయుధాన్ని కొనవచ్చు …
కానీ ధైర్యాన్ని కొనలేము.

?భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.

?మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకో.
ఆ పుణ్యమే రాతను నిర్ణయిస్తాయని
తెలుసుకో.

?ధనముతో పరుపుని కొనవచ్చు …
కానీ నిద్రను కాదు.

?ధనముతో విలాసవంతమైన వస్తువులను …
కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు.
దాచిపెట్టి ఏమి చేస్తావు, ఎక్కడ దాస్తావు,
జేబు అయినా ఉండదు శవం మీద గుడ్డకు.

?ప్రపంచానికి తాను చేసిన మేలే …
మానవునికి నిజమైన సంపద

?ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు,
ఎన్ని మంచి పనులు చేశామన్నది ముఖ్యం.

?ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో,
ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం.

?జీవితంలో ఈ ముగ్గురినీ దరికి రానివ్వకండి:
1. నీకు విలువ ఇవ్వని వారిని.
2. నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని.
3. మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి
ఇతరులకు చెడుగా చెప్పేవారిని.