Movies

తండ్రికి తగ్గ కూతురు…సోనమ్ కపూర్

తండ్రికి తగ్గ కూతురు…సోనమ్ కపూర్

బాలీవుడ్‌లో తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది నటి సోనమ్‌ కపూర్‌. అగ్రకథానాయకుడు అనిల్‌ కపూర్‌ ముద్దుల కుమార్తె ఈమె. వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారీ పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఆమె ఒకరు. నటించింది కొన్ని సినిమాలైనా ఎక్కువ హిట్లు అందుకుంది. తొలిసారిగా ‘బ్లాక్‌’ అనే సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దగ్గర సహాయ దర్శకురాలిగా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా రణ్‌బీర్‌ కపూర్‌తో కలసి ‘సావరియా’లో నటించి మెప్పించింది. ‘రాంజానా’లో సిగ్గుపడుతూ మురిపించింది. బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలొచ్చేలా చేసిందీ చిత్రం. ఇక ‘భాగ్‌ మిల్కా భాగ్‌’తో భారీ విజయాన్నుందుకుంది. ‘బేవకూఫియాన్‌’లో అల్లరిపిల్లగా అందరినీ మంత్రముగ్థుల్ని చేసింది. ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్టందుకుంది. ‘డోలీ కీ డోలీ’లో మంచి ప్రతిభ కనబరిచింది. ఇక సోనమ్‌ కేరీర్‌లో బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’. దీంతో ఆమె రెమ్యూనరేషన్‌ అమాంతం పెరిగిపోయింది. ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన విమానం నుంచి ప్రయాణికులను రక్షించిన ప్రముఖ మోడల్‌ నీరజా భనోట్‌ పాత్రను ‘నీరజా’ చిత్రంలో ఒక సామాజిక కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ చిత్రానికి సోనమ్‌ జాతీయ పురస్కారంతోపాటు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వరించాయి. ‘పాడ్‌మ్యాన్‌’లో అక్షయ్‌ కుమార్‌కు అక్షయపాత్రలా సాయమందిస్తూ మంచి ప్రతిభ కనబరిచింది. ఈ చిత్రంలో నటనకుగాను దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌ పురస్కారాన్ని అందుకుందామె. నటిగా సోనమ్‌ ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 2018 ‘వీరే దీ వెడ్డింగ్‌’లో నటించింది. ‘సంజు’లో రణ్‌బీర్‌ సింగ్‌ ప్రేమికురాలిగా నటించింది. సోనమ్‌ కపూర్‌ 2018లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాను వివామాడింది. ఇవాళ సోనమ్‌ (జూన్‌ 9న 1985) పుట్టినరోజు.