ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’లో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమె తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో లైవ్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఆమె ప్రస్తావించారు. ‘ఇందులో నా పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తా. అజయ్ దేవగణ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత, అంతర్జాతీయంగా విమాన సర్వీసులు ప్రారంభించిన తర్వాత సెట్స్‌కు వెళ్తానని ఆశిస్తున్నా’ అని చెప్పారు.
శ్రియ లీక్స్
Related tags :