తెలంగాణలో చెప్పుకోదగిన సహజ శిల్ప నిర్మాణం కోటలు మూడు. అవి వరంగల్, భువనగిరి, గాంధారి ఖిల్లా వీటికి విభిన్నంగా గాంధారి కోట తెలంగాణ ఉత్తర సరిహద్దు కోటగా పై రెండు కోట్ల కంటే ప్రాచీనమైన కోట గా ప్రసిద్ధి చెందింది, వారి సామంతులైన మేడ రాజులతో గాంధారి కోటను క్రీస్తుపూర్వం 9వ శతాబ్దం ప్రాంతంలో పటిష్టంగా నిర్మించారు, మేడ రాజుల నిర్మితమైన చెరువులు ఇప్పటికీ మేడ చెరువు అని పిలుస్తున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామానికి సుమారు 4 కిలోమీటర్లు దూరంలో ఉంది గాంధారి ఖిల్లా.
చారిత్రిక ఆధారాలను బట్టి ఈ కోట సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైనది అని తెలుస్తుంది. గోండు రాజులు ఈ కోటను కేంద్రంగా చేసుకొని పాలన సాగించారని చెప్తారు. కొంతకాలం వడ్డె రాజులు, రెడ్డిరాజులు పరిపాలించారని ప్రచారంలో ఉంది. అప్పట్లో కాకతీయులు దాడులు చేయడంతో ఆ రాజులు తలదాచుకోవడానికి ఈ కోటను నిర్మించారు స్థానికులు చెప్తారు. అయితే ఇప్పుడు లభిస్తున్న శాసనాలు, విగ్రహాలు, శిల్పాలు, దేవాలయాలను బట్టి ఇది గిరిజనులు నిర్మించుకున్న కోట అని తెలుస్తుంది.
ఈ కోటకు గాంధారి కోట అని పేరు రావడం వెనుక కూడా చాలా కథలు ఉన్నాయి. గాంధారి ఖిల్లాలో అనేక కళారూపాలు, శిల్ప సంపద, విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. గిరిజన రాజులు ఆరాధ్యదైవం గాంధారి మైసమ్మ దేవాలయం తో పాటు కాలభైరవుడు, శివుడు, వేంకటేశ్వరుడు, ఆంజనేయడి విగ్రహాలు ఉన్నాయి, దేవాలయాలే కాకుండా కోటపైకి దండెత్తి శత్రువులను పసిగట్టేందుకు కూడా ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేశారు. గాంధారి ఖిల్లా రక్షణ కోసం ఏర్పాటుచేసిన కట్టడాలలో ఒకటి నగారా గుండు, అప్పటి నిర్మాణ అద్భుతానికి ఇదో ఉదాహరణ. శత్రువులు వచ్చినప్పుడు కోటలో వారిని అప్రమత్తం చేసేందుకు దీనిని నిర్మించారు. కొండ పైకి వెళ్ళేందుకు నిర్మించిన మెట్లు కూడా ఇప్పటికీ చెక్కుచెదరలేదు.ఇక కొండ పైకి గుర్రాలు, ఏనుగులు వెళ్లడం కోసం కట్టిన మార్గం కూడా అలాగే ఉంది.
ఈ కోటలో స్థానికులు భోగం గుళ్ళుగా పిలుచుకునే ప్రత్యేకమైన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటికి ఉండే మూడు ప్రధాన ద్వారాలు కొండపై బండరాయిని తొలిచి సృష్టించారు.ఇవి శిల్ప కళలు వరంగల్లోని కాకతీయ తోరణానికి ఏ మాత్రం మించిపోకుండా ఉంటాయి. దేశ, విదేశియ పర్యటకులను బాగా ఆకర్షిస్తున్నాయి.
ఆనాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది ఈ గాంధారి కోట. గుట్టల మధ్య అప్పట్లో 2 ఎకరాల చెరువును నిర్మించారు.ఆ చెరువు ఇంకా ఉపయోగపడుతుంది.కొండల మధ్య ఎత్తులో నిర్మించడం అందర్నీ అబ్బురపరుస్తోంది.గుట్టల మధ్య వైద్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ మొక్కలను కూడా పెంచారు. ఎర్ర గురిగింజల చెట్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి.ఆనాటి రాజులు తమ భద్రతా సిబ్బంది కోసం నిర్మించిన గదులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి.గాంధారి ఖిల్లా పై మరో ప్రధాన ఆకర్షణ కొండపై నిర్మించిన నాగ శేషుని ఆలయం.అక్కడే నాగ విగ్రహానికి ఎదురుగా శిలాశాసనం ఉంటుంది.ఈ ఆలయం పక్కన మూడు బావులు ఉన్నాయి.వీటిని స్థానికులు సవతుల బావులని పిలుస్తారు.చాలా పురాతన బావులైనప్పటికీ ఇంకా చెక్కుచెదరలేదు వేసవిలో కూడా వీటిలో నీరు ఉంటుంది.గాంధారి మైసమ్మ జాతరలో ప్రధాన ఘట్టం మైసమ్మ పటం కొలుపు.ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత పద్మనాయక పూజారి, ఝాట్టీలు కోటలోని ప్రధాన దర్వాజా ఎడమ పట్టీకి చెక్కి ఉన్న విగ్రహం ముందట మైసమ్మ ఆకారంలో పసుపు కుంకుమలతో పట్నం గీసి దాని గాజులు, గంధం, నిమ్మకాయలతో అలంకరించి అందరు పూజలు చేస్తారు. ఆ తర్వాత మహిషాన్ని బలిస్తారు.ఈ తంతు రేచర్ల పద్మనాయకుల కాలపు రణం కుడపు సాంప్రదాయాన్ని జ్ఞప్తికి తెస్తుంది.
గాంధారి వనం:
హరిత తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఈ అటవీ ప్రాంతంలోని 134 హెక్టార్ల విస్తీర్ణాన్ని గాంధారి వనం గా మార్చారు. 40 ఎకరాల స్థలంలో జింకల పార్కు, హెర్బల్ గార్డెన్, నవగ్రహ వనం, రాశివనం, పిల్లల పార్కు తో ప్రతి ఒక్కరు ఆనందంగా గడిపే ప్రదేశం మార్చింది ప్రభుత్వం.