ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ‘వందేభారత్ మిషన్’ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దఫాల్లో దాదాపు 400 విమానాల ద్వారా 70 వేల మందిని భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మూడో దశ జూన్ 10నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా 43దేశాల నుంచి దాదాపు 60వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు పౌరవిమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా, కెనడా నుంచి వచ్చేవారికి నిర్ణీత రుసుమును ఏయిర్ ఇండియా ప్రకటించింది. అయితే ఇప్పటివరకు దాదాపు 70 వేల భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తీసుకొచ్చినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. నిన్న ఒక్కరోజే షికాగో, ఫ్రాంక్‌ఫర్ట్(జర్మనీ),లండన్, దుబాయ్, నెవార్క్ నుంచి 1300 మందిని తీసుకొచ్చినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మున్ముందు కూడా కొనసాగుతుందని స్పష్టంచేశారు.
నేటి నుండి వందే భారత్ ఫేజ్-3
Related tags :