ఏపీలో టెన్త్ పరీక్షలు జరిపి తీరుతాం: విద్యాశాఖ మంత్రి
పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరిగి తీరుతాయని తేల్చిచెప్పారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఏపీలో కూడా టెన్త్ పరీక్షలు రద్దవుతాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఉత్కంఠకు తెరదించారు.
షెడ్యూల్ ప్రకారమే జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కాకపోతే 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
విద్యార్థులను అనవసరమైన ప్రచారాలతో గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు.
కరోనా భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.