లాక్డౌన్ సమయంలో మరణించిన వృద్ధుడి ఆన్లైన్ ఖాతా సైబర్ నేరస్థులకు కాసులు కురిపించింది. 15 రోజుల్లో రూ.15 లక్షలను బదిలీ చేసుకున్నారు. ఆబిడ్స్‌లో ఉండే విశ్రాంత అధికారి క్రాంతికుమార్ కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. అమెరికాలో ఉన్న ఆయన కుమారులు లాక్డౌన్ కారణంగా రాలేదు. క్రాంతికుమార్, ఆయన మనవరాలి పేరుతో బ్యాంకులో సంయుక్త ఖాతా ఉంది. దీని ఏటీఎం కార్డు వివరాలతో సైబర్ నేరస్థులు రూ.15 లక్షలను వేర్వేరు రోజుల్లో బదిలీ చేసుకున్నారు. క్రాంతికుమార్ మనవరాలు తమ బంధువైన డాక్టర్ సత్వాలేకర్కు ఫోన్ చేసి ఖాతా వివరాలు తెలుసుకోమని కోరింది. రూ.25 లక్షలు నగదు ఉండగా అందులో రూ.15లక్షలు మాయమవడం ఆయన గుర్తించారు. బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం కార్డును ఎవరైనా కొట్టేశారా? ఎక్కడైనా పడితే తీసుకున్నారా? అన్న కోణంలో పోలీసులు పరిశోధిస్తున్నారు.
చనిపోయిన వ్యక్తి ఖాతా నుండి నగదు దోపిడీ

Related tags :