Business

భారత్‌కు తిరిగొచ్చిన్ 2300 కిలోల వజ్రాలు

భారత్‌కు తిరిగొచ్చిన్ 2300 కిలోల వజ్రాలు

ముంబైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 2 బిలియన్‌ డాలర్లకు పైగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సీలకు సంబంధించిన 2,300 కిలోల సానబెట్టిన వజ్రాలు, ముత్యాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హాంకాంగ్‌లో స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.1,350 కోట్లు ఉంటుందని ఈడీ తెలిపింది. హాంకాంగ్‌లో స్వాధీనం చేసుకున్న విలువైన వజ్రాలు, ముత్యాలు, వెండి ఆభరణాలను అన్ని రకాల న్యాయపరమైన లాంఛనాలను పూర్తి చేసుకొని బుధవారం వాటిని భారత్‌కు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్ చట్టం కింద వాటిని సీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.