Sports

యువరాజ్‌సింగ్ చనిపోలేదు-బతికే ఉన్నాడు

యువరాజ్‌సింగ్ చనిపోలేదు-బతికే ఉన్నాడు

గతేడాది ఇదే రోజు (జూన్‌ 10) యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌ సహా పోటీ తీవ్రంగా ఉండే టోర్నీలేవీ ఆడనని వెల్లడించాడు. అయితే సరదా క్రికెట్‌ మాత్రం ఆడతానని పేర్కొన్నాడు. గతేడాది వీడ్కోలును స్మరిస్తూ అభిమానులు ‘మిస్‌ యూ యువీ’ ట్యాగ్‌తో అతడిని తలుచుకుంటున్నారు. ఆరు సిక్సర్లు, ప్రపంచకప్‌లు, ఇంకా మరెన్నో రికార్డులను గుర్తుచేసుకుంటున్నారు. తమిళనాడు ఎమ్మెల్యే జే అన్బళగన్‌ (62) కొవిడ్‌-19 కారణంగా ఈ రోజే మృతిచెందారు. యాదృచ్ఛికంగా ఆయన జన్మదినమూ ఈ రోజే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ ట్యాగ్‌లైన్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఈ రెండు ట్యాగ్‌లైన్లు ఒకేసారి ట్రెండ్‌ అవ్వడం, ‘మిస్‌ యూ యువీ’ కిందే ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ ఉండటంతో ట్విటర్లో కలవరం మొదలైంది. తాము ఎంతో భయపడ్డామని చాలా మంది ట్వీట్‌ చేశారు.