Movies

బికినీ వేసిందని గ్యాంగ్‌రేప్ చేస్తామన్నారు

బికినీ వేసిందని గ్యాంగ్‌రేప్ చేస్తామన్నారు

తాను బికినీ ధరించిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసినందుకు తనపై ఓ మహిళా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధించిందని బాలీవుడ్‌ నటి, మోడల్‌ అలన పాండే పేర్కొన్నది. తనకు ఎదురైన విమర్శలపై అలన పాండే మాట్లాడుతూ ‘నా బికినీ ఫొటోను ఉద్దేశిస్తూ ఓ మహిళ అసభ్యకరమైన కామెంట్స్‌ చేసింది. తనను గ్యాంగ్‌రేప్‌ చేయడంలో తప్పులేదంటూ పేర్కొన్నది. మా అమ్మనాన్నలను ట్యాగ్‌ చేసింది. వారు ఆ కామెంట్స్‌ చూశారు. ఆ బెదిరింపులను చూసి భయపడిపోయాను. వెంటనే ఆ మహిళ అకౌంట్‌ను బ్లాక్‌ చేశాను. పళ్లై నా కంటే వయసులో చిన్నదైన ఓ కూతురు ఉన్న మహిళ మరో మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధను కలిగించింది. గ్లామర్‌ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ప్రతిరోజూ ఇలాంటి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్లను ఎదర్కొంటూ రాణించడం కష్టమే’ అని తెలిపింది. అనన్య పాండే కజిన్‌ అయిన అలన ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.