స్రెచ్ మార్క్స్ పోవాలంటే గుడ్డుతో ఇలా చేయండి..
కొంతమందికి డెలివరీ అయ్యాక స్రెచ్ మార్క్స్ పడుతుంటాయి. మరికొంతమందికి కాస్తా లావు ఉండి తగ్గాక ఈ సమస్య ఉంటుంది. ఇవి అంత త్వరగా పోవు. వీటిని ఈజీగా పోగొట్టుకోవాలంటే ఇలా చేయండి..
స్ట్రెచ్ మార్క్స్.. పోగొట్టుకునేందుకు ఎన్ని క్రీమ్స్ రాసినా అంతగా ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు వాడితే త్వరగా సమస్య తగ్గుతుంది. ఇందులో ముఖ్యంగా కోడిగుడ్డు.. అవును గుడ్డులో విటమిన్ ఎ, ప్రోటిన్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మ కణాల ఏర్పాటులో కీ రోల్ పోషిస్తాయి. చర్మాన్ని కాంతి వంతంగా అందంగా చేస్తాయి.
స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గించేందుకు మార్క్స్ ఉన్నచోట కోడిగుడ్డు సొన రాయాలి. ఇలా రెగ్యులర్‌గా రాస్తుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అదే విధంగా ఆ గుడ్డు సొనలో ఆలివ్ ఆయిల్ కలిపి రాయండి.. ఇలా చేస్తుంటే సమస్య తగ్గుతుంది.
అలోవెరా..
అలోవెరా జెల్లో అద్భుత గుణాలు ఉంటాయి. దీనిని కూడా రెగ్యులర్‌గా రాస్తుంటే సమస్య తగ్గుతుంది. అలోవెరా జెల్, ఆలివ్ ఆయిల్ కలిపి రాయడం వల్ల కూడా మంచి పరిష్కారం అవుతుంది.
ఆముదం..
ఆముదంలో కూడా అద్భుత గుణాలు ఉన్నాయి. ఈ నూనెని రెగ్యులర్‌గా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాస్తే సమస్య తగ్గిపోతుంది.
బంగాళదుంప..
బంగాళదుంపని గ్రైండ్ చేసి రసాన్ని తీయాలి. దీనిని మార్క్స్ ఉన్న చోటా బాగా రుద్దాలి. ఇలా చేస్తుంటే తక్కువ టైమ్‌లోనే సమస్య తగ్గిపోతుంది.
నిమ్మతో..
నిమ్మలోనూ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. వీటిని తగ్గించుకునేందుకు మార్క్స్ ఉన్నచోట నిమ్మచెక్కతో రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే సమస్య తగ్గుతుంది.
ఆలివ్ ఆయిల్, బాదం..
ఆలివ్, బాదం ఆయిల్స్‌ని మిక్స్ చేసి మార్క్స్ ఉన్న చోట రాయండి. ఇలా రాస్తుంటే సమస్య తగ్గుతుంది.
పంచదార, నిమ్మరసం..
పంచదారలో కాస్తంత నిమ్మరసం కలిపి రెండు చుక్కల బాదం నూనె కలిపి రాయండి. ఇలా చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది.
కొకొవా బటర్..
స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకునేందుకు కొకొవా బటర్ బెస్ట్ ఆప్షన్. దీనిని రెగ్యులర్‌గా రాస్తుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. కొకొవా బటర్ రాస్తుంటే సమస్య తగ్గిపోతుంది.
దోసకాయ, నిమ్మరసం..
దోసకాయని మిక్సీ పట్టి గుజ్జులా చేయండి.. నిమ్మరసం కలపండి.. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి వాటిని మార్క్స్ మీద రాసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది.
ఎన్ని క్రీమ్స్ రాసినా సమస్య తగ్గదు. అలాంటప్పుడు ఇలాంటి చిట్కాలు పాటిస్తుంటే సమస్య తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. అందరూ ఈజీగా పాటిస్తాయి. వీటి వల్ల ఎలాంటి సమస్యలు రావు.