‘‘అతి చిన్న వయసులో నటిగా కెరీర్ మొదలుపెట్టా. ఎన్నో కలలతో సినిమాల్లోకి వచ్చా. మంచి ఆర్టిస్ట్‌గా నిరూపించుకోవడానికే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటా. సక్సెస్ నాలో ఏ మార్పు తీసుకురాలేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నా’’ అని భూమి పెడ్నేకర్ అన్నారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో చేసిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘ఎన్నో కలలతో సినిమాల్లోకి వచ్చా. చక్కని విజయాలు అందుకున్నా. సక్సెస్ నాలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. కొన్ని కలలు మాత్రం కళ్లల్లో అలాగే ఉన్నాయి. సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పుడిప్పుడే నా జీవితం కీలక మలుపులు తీసుకుంటోంది. కలలు పెద్దగా అవుతున్నాయి. ఎన్నో అనుభవాలు ఎదురైనప్పటికీ నా మనస్తత్వం ఇంకా బలహీనంగానే ఉందనిపిస్తుంది’’ అని ఆమె అన్నారు.
నాకు బలం తక్కువ
Related tags :