Movies

అంతా భయం భయం

అంతా భయం భయం

‘‘సెట్స్‌లో అడుగుపెట్టే ప్రతిసారీ నన్నూ కొన్ని భయాలు వెంటాడుతుంటాయి’’ అంటోంది నాయిక నిత్యా మేనన్‌. ‘ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నటిగా నిత్యను భయపెట్టిన పాత్రలేమైనా ఉన్నాయా?’ అని ప్రశ్నిస్తే.. ‘‘ఓ కొత్త పాత్రలోకి అడుగుపెట్టే ప్రతిసారీ మనసుని కొన్ని తెలియని భయాలు వెంటాడుతుంటాయి. అందుకే సెట్స్‌లోకి వచ్చిన రెండు, మూడు రోజులు ఎలా నటిస్తున్నానో మోనిటర్‌లో పరిశీలిస్తుంటా. ఆ పాత్రకు కాస్త అలవాటు పడ్డాక మళ్లీ ఏ భయాలు ఉండవు’’ అంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరణలకు వెళ్లడానికి మీరు సిద్ధమేనా?’ అంటే… ‘‘చిత్రీకరణలు ప్రారంభం కాగానే సెట్స్‌లోకి వెళ్లిపోవాలని ఎదురు చూస్తున్నా. ఇకపై వీలైనంత వరకు తక్కువ సిబ్బందితోనే చిత్రీకరణలు జరిపేలా చూడాలి’’ అంది నిత్య.