Editorials

36వ స్థానానికి పడిపోయిన ఆంధ్రా విశ్వవిద్యాలయ ర్యాంకు

Andhra University Rank Drops To 36th In India

ఏపీలో ఎంతో ఘనచరిత్ర ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఒకటి. కానీ జాతీయస్థాయికి వచ్చేసరికి ర్యాంకుల్లో ఎక్కడో నిలిచింది. తాజాగా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రా వర్సిటీకి 36వ స్థానం లభించింది.యూనివర్సిటీల విభాగంలో ప్రకటించిన ఈ ర్యాంకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 15వ ర్యాంకు దక్కగా, కేఎల్ యూనివర్సిటీ 70వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో నెంబర్ వన్ గా బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జేఎన్ యూ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఇక, ఇంజినీరింగ్ విద్యలో చూస్తే…. ఐఐటీ మద్రాస్ కు ఎదురులేకుండా పోయింది. ఈ ఏడాది కూడా నెంబర్ వన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఐఐటీ హైదరాబాదు ఈ జాబితాలో 17వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.