Business

₹48వేలు దాటిన పసిడి

₹48వేలు దాటిన పసిడి

10 గ్రాముల పసిడి ధర గురువారం రూ.477 పెరిగి, రూ.48,190కి చేరినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. అంత క్రితం రోజు ఇది రూ.47,713 వద్ద ముగిసింది. ‘డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ తగ్గడంతో, దిల్లీలో 24 క్యారెట్ల స్పాట్‌ గోల్డ్‌ ధర రూ.477 పెరిగింద’ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకులు (కమొడిటీస్‌) తపన్‌ పటేల్‌ వెల్లడించారు. కిలో వెండి ధర రూ.49,842 నుంచి స్వల్పంగా రూ.26 పెరిగి, రూ.49,868కి చేరింది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్‌ (31.1 గ్రాములు) బంగారం ధర 1,735 డాలర్లు, వెండి 17.86 డాలర్లు పలుకుతున్నాయి.