కరోనా వైరస్ వల్ల పరిస్థితులు భయంకరంగా మారాయని.. తన కుమార్తె శ్రద్ధాకపూర్‌ని తిరిగి ఇప్పుడే షూటింగ్స్‌కి వెళ్లనివ్వనని నటుడు శక్తి కపూర్ అన్నారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్ పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న సినిమా, బుల్లితెర షూటింగ్‌ల గురించి శక్తి కపూర్ తాజాగా స్పందించారు. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను బయటకు వెళ్లి పని చేయాలనుకోవడం లేదు. అలాగే నా కుమార్తెను కూడా షూటింగ్స్‌కి పంపించాలనుకోవడం లేదు. కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు. మున్ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. మనిషి ప్రాణాలకంటే పని ముఖ్యం కాదు. ఇప్పుడే షూటింగ్స్ ప్రారంభిస్తే పరిస్థితులు మరింత అస్తవ్యస్తంగా మారతాయి. ఇంకొంత సమయం వేచిచూడడం మంచిదని సినీ పరిశ్రమకు చెందిన నా స్నేహితులకు తెలియజేశాను’ అని ఆయన అన్నారు.
నేను వెళ్లనివ్వను
Related tags :