ఆటను ఆస్వాదిస్తున్నానని, ఇప్పట్లో రిటైర్‌కానని భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి అన్నాడు. ‘‘కచ్చితంగా ఇంతకాలం ఆడతానని చెప్పను. కానీ ఇప్పుడు నేను నా ఫుట్‌బాల్‌ను ఆస్వాదిస్తున్నా. ఇప్పట్లో మాత్రం ఆటకు దూరం కాను. చాలా ఫిట్‌గా ఉన్న భావనతో ఉన్నానని నా భార్యతో చెప్పా. పరుగులో ఉదాంత, ఆషిక్ (భారత జట్టు, బెంగళూరు ఎఫ్‌సీలో సహచరులు)లకు సవాలు విసరబోతున్నా. అబ్దుల్ సాహాల్ మరిన్ని గోల్స్ కొట్టి నన్ను తోసేస్తే (జాతీయ జట్టు నుంచి) తప్ప నేను జట్టు తరఫున ఆడుతూనే ఉంటా’’ అని ఛెత్రి చెప్పాడు. 2005లో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల ఛెత్రి భారత్ తరఫున 115 మ్యాచ్‌ల్లో 72 గోల్స్ కొట్టాడు. ప్రస్తుత ఫుట్‌బాలర్లలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (99) తర్వాత అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడు ఛెత్రినే.
ఇప్పట్లో రిటైర్మెంట్ లేదు
Related tags :