కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికాలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. దీంతో తిరిగి తమ పౌరులకు ఉపాధి కల్పించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా పలు రకాల ఉద్యోగ, ఉపాధి వీసాలను కొంతకాలం పాటు నిలిపివేసే ప్రత్యామ్నాయాన్నీ పరిశీలిస్తున్నట్లు అక్కడి ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ అంశంపై స్పందించిన వైట్ హౌస్.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అమెరికా పౌరుల ఉపాధిని రక్షించేందుకు నిపుణులు అనేక మార్గాలు సూచించారని.. వాటన్నింటినీ వైట్ హౌస్ పరిశీస్తోందని అధికార ప్రతినిధి హోగన్ గిడ్లే తెలిపారు. హెచ్-1బీ సహా హెచ్-2బీ, జే-1, ఎల్-1 వీసాలు కూడా నిలిపివేయాలనుకుంటున్న జాబితాలో ఉన్నట్లు సమాచారం.
H1B ఆపేసే ఆలోచనలో ట్రంప్?
Related tags :