ఓ వ్యక్తి ఐశ్వర్యపై తనకున్న ఇష్టాన్ని తెలుపుతూ కామెంట్ చేశారు. ‘త్రిపురలో నేను మీకు వీరాభిమానిని. మీ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తా. మీ నటన నాకెంతో ఇష్టం. ఈ ప్రపంచంలో మీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అక్క’ అని పోస్ట్ చేశారు. దీనికి ఐశ్వర్య స్పందిస్తూ.. అలాంటి మాటలు మాట్లాడొద్దని కోరారు. ‘ధన్యవాదాలు.. కానీ దయచేసి అలా మాట్లాడొద్దు. ఎదుటి వ్యక్తి కోసం చనిపోవడానికి మనం జీవించడం లేదు. నువ్వు సంతోషంగా ఉన్నానని చెబితే నాకు అదే చాలు. మరోసారి అలా మాట్లాడను అంటే (ప్రాణాలు తీసుకుంటా అని చెప్పడాన్ని ఉద్దేశించి..) నేనెప్పుడూ నీకు మంచి స్నేహితురాలిగా ఉంటా. జాగ్రత్త’ అని ఆమె పేర్కొన్నారు.
ఐశ్వర్య అక్క కోసం ప్రాణాలు ఇస్తా
Related tags :