వారంలోనే మెరిసే స్కిన్ కావాలా.. అయితే గ్రీన్ టీ ప్యాక్స్ ట్రై చేయండి..
అందంగా మెరిసే చర్మం కావాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు. కానీ, గ్రీన్ టీతో ఇంట్లోనే మెరిసే ప్యాక్స్ వేసుకోండి.. రిజల్ట్ మీరే చూడండి..
గ్రీన్ టీ గురించి ప్రజెంట్ అందరికీ తెలిసిందే.. బరువు తగ్గడం దగ్గర్నుంచి బ్రెయిన్ సరిగ్గా పని చేయడం వరకూ గ్రీన్ టీతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రోజూ ఎందుకు ఓ కప్పు గ్రీన్ టీ తాగితే ఎన్నో లాభాలు ఉంటాయి.
గ్రీన్ టీ ని హెల్దీ స్కిన్ కోసం కూడా వాడొచ్చు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రీన్ టీతో డిఫరెంట్ స్కిన్ టైప్స్ వాళ్ళు డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు.
గ్రీన్ టీ ఫేస్‌కి అప్లై చేస్తే ఏమవుతుందంటే..
1. స్కిన్ కాన్సర్ రాదు..
2. అల్ట్రా-వయలెట్ కిరణాల నుంచి స్కిన్‌ని కాపాడుతుంది.
3. మొటిమలని కంట్రోల్ చేస్తుంది.
4. యవ్వనంగా కనిపించేటట్లు చేస్తుంది.
ఒక్కో స్కిన్ టైప్ప్‌కి సరిపోయే గ్రీన్ టీ ఫేస్ ప్యాక్స్ ఇవే..
నార్మల్, కాంబినేషన్ స్కిన్
1. గ్రీన్ టీ, పసుపు
ఒక టీ స్పూన్ శనగపిండిలో పావు టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్లు అప్పుడే తయారు చేసిన గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. కళ్ళు, నోటి చుట్టూ అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి, రెండు సార్లు చేస్తే రిజల్ట్స్ మీరే చూస్తారు.
2. గ్రీన్ టీ, ఆరెంజ్ పీల్ ప్యాక్..
ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ లో ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి వేసి కలపండి. ఇందులో అర టీస్పూన్ తేనె కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి గుండ్రంగా స్క్రబ్ చేయండి. దీనిని అలానే పదిహేను నిమిషాలు వదిలేసి గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయొచ్చు.
3. గ్రీన్ టీ, పుదీనా ప్యాక్..
రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్‌టీ లో రెండు టేబుల్ స్పూన్ల పుదీనా పేస్ట్ కలపండి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. కళ్ళు, నోరు చుట్టూ అప్లై చేయొద్దు. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయాలి.
ఆయిలీ స్కిన్
4. గ్రీన్ టీ, బియ్యప్పిండి ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో ఓ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయొచ్చు.
5. గ్రీన్ టీ, నిమ్మ రసం ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ అప్పుడే తయారు చేసిన గ్రీన్ టీలో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. పది నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి ఒక సారి చేయండి.
6. గ్రీన్ టీ, ముల్తానీ మట్టి ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో రెండు, మూడు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయాలి.
డ్రై స్కిన్
7. గ్రీన్ టీ, తేనె ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒక సారి చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.
8. గ్రీన్ టీ, మీగడ
రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ లో ఒక టీ స్పూన్ మీగడ, ఒక టీ స్పూన్ పంచదార పొడి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి గుండ్రంగా స్క్రబ్ చేయండి. పదిహేను నిమిషాలు అలాగే వదిలేసి గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయాలి..
9. అవకాడో, గ్రీన్ టీ ప్యాక్..
బాగా పండిన అవకాడో ని మెత్తగా చేసి అందులో రెండు టీ స్పూన్ల గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలి చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయాలి..
10. గ్రీన్ టీ, అరటి పండుతో..
బాగా మగ్గిన అరటి పండుని మెత్తగా చేసి అందులో రెండు టీ స్పూన్ల గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయాలి.
11. గ్రీన్ టీ, నిమ్మ రసం ప్యాక్..
ఒక టేబుల్ స్పూన్ శనగపిండి లో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, ఒక టీ స్పూన్ నిమ్మ రసం వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చెయ్యచ్చు.
12. గ్రీన్ టీ, పెరుగు ప్యాక్..
ఒక టీ స్పూన్ గ్రీన్ టీ లో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ పెరుగు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడగండి.