* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు,మరణాలుదేశంలో మూడు లక్షలు దాటిన కరోనా కేసులుదేశవ్యాప్తంగా 3,08,993 కేసులు,8884 మంది మృతిదేశ వ్యాప్తంగా 1,45,779యాక్టీవ్ కేసులు, 1,54,330 మంది డిశ్చార్జ్గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,458 కేసులు,386 మంది మృతిదేశంలో 50 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటుమహారాష్ట్రలో లక్షకు పైగా కరోనా కేసులుమహారాష్ట్రలో అత్యధికంగా 1,01,141 కేసులు,3717 మంది మృతితమిళనాడులో 40,6987 కేసులు,367 మంది మృతిఢిల్లీలో 36,824 కేసులు,1214 మంది మృతిగుజరాత్ లో 22,527 కేసులు,1415 మంది మృతి
* కరోనాకు బలైన కిస్సింగ్ బాబాభక్తుల చేతిపై ముద్దు పెట్టి కరోనా వైరస్‌ను నయం చేస్తానన్న ఓ బాబా.. వైరస్ బారిన పడి మరణించాడు.ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ నగరంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. భక్తుల చేతులపై ముద్దు పెడితే వారి రోగాలు నయమవుతాయని రత్లామ్ నగరానికి చెందిన అస్లాం బాబాకు పేరుంది.అందుకుని పెద్ద సంఖ్యలో భక్తులు ఆయనను దర్శించుకునే వారు.ఆయన వారి చేతులపై ముద్దపెడుతూ ఉండేవాడు.
* కేరళలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఒక్క రోజే 85 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడినవారిలో1045 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కేరళలో ప్రస్తుతం 1342 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యశాఖ వెల్లడించింది.
* ఈ నెల 15 నుంచి జిల్లా కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ నెలాఖరు వరకు జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్‌డౌన్ కొనసాగించాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం పునఃసమీక్షించింది. హైకోర్టు నిర్ణయానికి న్యాయవాదులు సహకరించాలని ఏజీ ప్రసాద్ కోరారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఈ రోజు కొ త్తగా మరో 502 కొత్త పాజిటివ్ కేసులు; 20 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,118కి పెరిగింది. అలాగే, ఈ మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 385కి పెరిగినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు.
* జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మళ్లీ కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు నిన్న మేయర్‌కు మరోసారి కరోనా పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో బొంతు రామ్మోహన్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గతంలో నగరంలోని రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్‌లో అధికారులతో కలిసి ఇటీవల మేయర్ టీ తాగారు. అయితే, ఆ హోటల్‌లో పనిచేసిన వ్యక్తికి కరోనా వచ్చిందని తేలడంతో ముందు జాగ్రత్తగా వారం క్రితమే మేయర్ సైతం పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
* రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ రోజు కొత్తగా 8700 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 5,20,000కు పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 6,800 మందికి పైగా కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
* ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతరూపం దాలుస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 222 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారిన పడినవారిలో రాష్ట్రానికి చెందిన వారు 186 మంది కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 33 మంది, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు ఉన్నారు. ఇప్పటివరకు మొత్తంగా రాష్ట్రానికి చెందినవారు 4588 మంది కొవిడ్ బారిన పడగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1068మంది; విదేశాల నుంచి వచ్చిన 202మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5858గా ఉంది. కొత్తగా కృష్ణా జిల్లాలో రెండు మరణాలు నమోదు కావడంతో మొత్తం మృతుల సంఖ్య 82కి పెరిగింది.