Agriculture

రైతులకు విత్తనాలు అందజేసిన అమల

TNILIVE Telugu Agricultural News || Akkineni Amala Donates Seeds To Farmers

ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్‌ హైదరాబాద్‌ కో ఫౌండర్‌ అక్కినేని అమల రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో సర్పంచి విష్ణువర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో 650 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. ఒక్కో రైతుకు సుమారు 4కిలోల విత్తనాలను పంపిణీ చేసి వారిలో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ… సేంద్రియ వ్యవసాయ విధానంలో పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. ఈ విధానంపై రైతులు ఆసక్తితో ముందుకు వస్తే నిపుణులైన శాస్త్రవేత్తలను పాపిరెడ్డిగూడకు పిలిపించి అవగాహన కల్పించనున్నట్లు అమల పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్‌ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమల ఆకాంక్షించారు.