నేటితో ముగియనున్న ముహుర్తాలు.. శ్రావణంలోనే మళ్లీ భాజాభజంత్రీలు
వివాహాలకు ఆదివారంతో మంచి ముహూర్తాలు ముగియనున్నాయి.
కరోనాతో వేసవిలో జరగాల్సిన వివాహాలకు బ్రేక్ పడింది.
చివరకు లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా 50 మంది బంధుమిత్రులతో వివాహాలు జరుపుకున్నారు.
ఆదివారం ఒక్కరోజే ముహూర్తాలు ఉండటంతో ఇవాళ పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి.
ఇది దాటితే మళ్లీ ముహూర్తాలకు నిరీక్షించాలి. 21న జ్యేష్ఠ అమావాస్య ప్రారంభమవుతుంది.
జూన్ 22 నుంచి జూలై 20 వరకూ ఆషాఢ మాసం.
ఇక వివాహాలకు జూలై 22 నుంచి ఆగస్టు 14 వరకూ ఉండే శ్రావణ మాసంలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి.
జూలైలో 23,25, 26,27,29, ఆగస్టులో 2,5,8,9,13,14 తేదీల్లో ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు.