DailyDose

ESI కుంభకోణంలో సచివాలయ ఉద్యోగుల కీలక పాత్ర-నేరవార్తలు

ESI కుంభకోణంలో సచివాలయ ఉద్యోగుల కీలక పాత్ర-నేరవార్తలు

* తూర్పు చైనాలో ఆయిల్​ ట్యాంకర్​ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య 166కి చేరింది. మొదట ట్యాంకర్​ పేలడం, ఆ తరువాత ఓ వర్క్​షాపులో మరో పేలుడు సంభవించడం వల్ల, సమీపంలోని పరిశ్రమలు, ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

* నగరంలో జరిగిన గ్యాంగ్ వార్ లో పండు అలియాస్ మణికంఠ అరెస్ట్.సందీప్ తో జరిగిన గ్యాంగ్ వార్ లో వినియోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.కోర్ట్ లో పండును హాజరు పరిచిన పోలీసులు.గ్యాంగ్ వార్ కు సంబంధించి ఇప్పటి వరకు 33 మంది అరెస్ట్.మరో 15మంది కోసం గాలిస్తున్నారు 6 బృందాలు.

* ఈఎస్ఐ స్కామ్ లో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు.ఆధారాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులు.శాఖాపరమైన జీవోలను పరిశీలించలేదని గుర్తించిన ఏసీబీ.ముగ్గురు ఉద్యోగులను విచారించనున్న ఏసీబీ అధికారులు.ఆధారాలు సేకరించి కేసులు నమోదుచేస్తామన్న ఏసీబీ అధికారులు.

* కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని పోచమ్మ బస్తీలో మురికి కాలువలో పసికందు మృతదేహం లభ్యమయ్యింది. ఇదిలా ఉండగా శిశువు మృతదేహం తీసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంటతో..ఓ స్థానిక రిపోర్టర్ మానవత్వం చాటుకున్నాడు. టుడే టివి కాగజ్ నగర్ రిపోర్టర్ ఇర్షాద్ మురికి కాలువలో దిగి, పసికందు మృతదేహాన్ని బయటకు తీసి, పోలీసులకు అప్పగించారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న అధికారులు, స్థానికులు ఇర్షాద్ ను అభినందించారు. ముక్కుపచ్చలారని పసికందు మృతదేహం మురికి కాలువలో లభ్యమవ్వడం పట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* పశ్చిమబెంగాల్లో ఓ నాలుగు అంతస్తుల భవనం నిట్టనిలువునా కూలిపోయింది. పేక మేడలా భవనం కూలిపోయిన సంఘటన మిడ్నాపూర్  జిల్లాలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన ఈ భవనం వీడియో చూసి చుట్టుప్రక్కల జనం భయభ్రాంతులకు గురయ్యారు.