అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో జేరబోయే విద్యార్థులకు కరోనా సమయంలో మార్గనిర్దేశం చేసే నిమిత్తం అమెరికాలో ప్రముఖ విద్యా రంగ నిపుణులు యూనివర్సీటీ కన్సల్‌టెంట్స్ ఆఫ్ అమెరికా సీ.ఈ.ఓ. రాబర్ట్ లీవిన్‌తో కలిసి నాట్స్ వెబినార్ నిర్వహించింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించారు. యూనివర్సీటీల్లో ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు ఉంటాయి? తాజాగా కోవిడ్ నేపథ్యంలో అవి ఎలా మారాయి? దరఖాస్తుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే అంశాలపై రాబర్ట్ ప్రసంగించారు. నాట్స్ టెంపాబే టీం ఏర్పాటు చేసిన ఈ వెబినార్ నిర్వహణకు నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, ప్రతినిధులు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల తదితరులు సహకరించారు.
అమెరికా విద్యార్థుల కోసం నాట్స్ వెబినార్
Related tags :