నటనటులు ఎంతోమంది. కానీ వెండితెరపైన తమదైన ముద్రవేసేవాళ్లు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమందిలో తెలంగాణ శకుంతల ఒకరు. గయ్యాలి పాత్రయినా, ప్రతినాయక పాత్రయినా, హాస్య ప్రధానమైన పాత్రయినా… తనకి తానే సాటి అని నిరూపించుకొన్న నటి తెలంగాణ శకుంతల. ఆమె అసలు పేరు కడియాల శకుంతల. తెలంగాణ యాసతో సంభాషణలు చెప్పడంలో దిట్ట కావడంతో ఆమె ఇంటిపేరు తెలంగాణగా మారిపోయింది. పలు చిత్రాల్లో ఆమె తెలంగాణ యాసలోనే సంభాషణలు చెబుతూ వినోదాన్ని పంచింది. నాటకరంగం నుంచి వెలుగులోకి వచ్చిన శంకుతల 1979లో ‘మాభూమి’ ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. 2000 సంవత్సరం నుంచి ఆమె క్యారెక్టర్ నటిగా విజృంభించారు. సుమారు వంద చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తమిళంలోనూ నటించిన తెలంగాణ శకుంతల 1951 జూన్ 9న మహారాష్ట్రలో జన్మించారు. 2014 జూన్ 14న గుండెపోటుతో హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతిచెందారు. ఈ రోజు ఆమె వర్ధంతి.
తెరపై తనదైన ముద్ర వేసిన తెలంగాణ శకుంతల
Related tags :