Business

ఇండియాలో భారీగా మూతపడనున్న “బుల్లెట్” కార్యాలయాలు

ఇండియాలో భారీగా మూతపడనున్న “బుల్లెట్” కార్యాలయాలు

కరోనా మహమ్మారితో ఉత్పత్తి, డిమాండ్‌ లేక ఇప్పటికే పలు చిన్నా పెద్ద కంపెనీలు భారీగా నష్టపోయాయి. దీంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించగా, మరికొన్ని వేతనాల్లో కోతలు విధించాయి. కరోనా ప్రభావంతో చాలా వ్యాపారాలు దీర్ఘకాలం లేదా శాశ్వతంగా మూతపడే అవకాశాలున్నాయని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ క్రమంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంలో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 13 రీజనల్‌ కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించి, అంతర్జాతీయంగా సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో మన దేశంలోని పలు కార్యాలయాలను మూతపడనుండగా, ఇందులో చెన్నై, బెంగళూరు, గురుగ్రామ్‌, ముంబై, జార్ఖండ్‌, హైదరాబాద్‌, భువనేశ్వర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది.