లాక్‌డౌన్‌కు ముందు తన భర్త బెనెడిక్ టేలర్‌తో లండన్ చేరుకున్నారు రాధిక ఆప్టే. లాక్‌డౌన్ విధించిన తర్వాత ఆమె ఇక్కడకు వచ్చే ఛాన్స్ దొరకలేదు. అయితే అక్కడ భర్తతో బెస్ట్ టైమ్ స్పెండ్ చేశానని చెబుతున్నారామె! ‘‘లండన్‌లో కరోనా ప్రభావం అంతగా లేదు. పైగా ఇక్కడ రూల్స్ కూడా వేరు. బయటకు వెళ్లకూడదనే నిబధనలు విధించలేదు. నేనిక్కడ నిత్యావసర వస్తువుల కోసం, స్నేహితుల్ని కలవడం కోసం జాలీగా బయటకు వెళ్లేదాన్ని. సైకిల్ రైడ్, లాంగ్ వాక్ రెగ్యులర్‌గా చేసేదాన్ని. ముఖ్యంగా వంట మీద ఎక్కువ దృష్టిపెట్టా. నాకంతా ఇక్కడ మామూలు జీవితంలాగే అనిపించింది. నా జీవితంలో ఇంత పెద్ద బ్రేక్ తీసుకోవడం ఇదే మొదటిసారి. కానీ మా ఆయనతో బెస్ట్ టైమ్ స్పెండ్ చేశా. మామూలుగా నేను పుస్తకాలు ఎక్కువ చదువుతా. లాక్‌డౌన్ టైమ్‌లో ఎందుకో పుస్తకం తెరవాలనిపించలేదు. కానీ రైటింగ్ మొదలుపెట్టా. ఏం రాశానో, ఎందుకు రాశానో ఇప్పుడే చెప్పను. దానికి ఇంకా టైమ్ ఉంది. అయితే మాతృదేశాన్ని, ఆల్ఫోన్సో మామిడిపళ్లను చాలా మిస్ అవుతున్నా’’ అని రాధికా ఆప్టే అన్నారు.
నేను చెప్పను బాబూ!
Related tags :