Sports

ఆ అమ్మాయి కోసం కోహ్లీ ఈర్ష్యతో రగిలిపోయేవాడు

Virat Kohli Lost His Control And Focus For That Girl Friend

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మాజీ ప్రేయసితో చాట్‌చేస్తే అతడికి నచ్చేది కాదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నిక్‌ కాంప్టన్‌ వెల్లడించాడు. తాజాగా అతడు క్రికెట్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2012 భారత పర్యటన సందర్భంగా తన టెస్టు అరంగేట్రంపై స్పందించాడు. ఈ నేపథ్యంలోనే ఆ సిరీస్‌లో కోహ్లీతో వివాదం తలెత్తిందని చెప్పాడు. ‘నేను ఆమెతో చాట్‌ చేశాను. ఆ విషయం బయటకు పొక్కింది. అది కోహ్లీకి ఏమాత్రం నచ్చలేదు. నేను బ్యాటింగ్‌కు వచ్చే ప్రతీసారి ఏదో అనేవాడు. ఆమె తన ప్రేయసి అని చెప్పడానికి ప్రయత్నించేవాడు. ఆమె కూడా అతడు తన మాజీ ప్రేయుడని చెప్పేది. ఆ పరిస్థితి ఎలా ఉండేదంటే.. ఎవరు నిజం చెబుతున్నారని అనిపించేది. నేనేం చెబుతున్నానో మీకు అర్థమై ఉంటుంది’ అని కాంప్టన్‌ పేర్కొన్నాడు. అప్పుడా విషయం చాలా సరదాగా అనిపించిందని, తర్వాత అది ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకి తెలిసిందని చెప్పాడు. కోహ్లీని రెచ్చగొట్టడానికి దాన్నొక ఉపాయంలా మార్చుకున్నామన్నాడు. దాంతో అతడి ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశామని స్పష్టంచేశాడు. అయితే, అప్పుడు కోహ్లీ ప్రేయసిగా ఉన్న ఆమె పేరును మాత్రం ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ వెల్లడించలేదు. మరోవైపు టీమ్‌ఇండియా సారథి తర్వాత బాలీవుడ్‌ నటి అనుష్కశర్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తర్వాత అనేక సందర్భాల్లోనూ తన భార్యపట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. అనుష్క వచ్చాకే తన జీవితంలో నిలకడత్వం వచ్చిందన్నాడు. ఇక 2012లో ఇంగ్లాండ్‌.. భారత పర్యటనకు వచ్చి 4 టెస్టులు, 2 టీ20లు, 5 వన్డేలు ఆడింది. ఆ జట్టు 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకోగా టీమ్‌ఇండియా 3-2తో వన్డే సిరీస్‌ గెలుపొందింది. ఇక టీ20ల్లో చెరో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేశాయి.