కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై సీఎం సమీక్ష
ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని సీఎం ఆదేశం
అమరావతి:
– కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్ష
– పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా పలువురు అధికారులు హాజరు
– కడప స్టీల్‌ప్లాంట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు
– హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్ స్టీల్ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
– ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చ
– ఆ సంస్థలతో చర్చలు జరపాలని అధికారులకు సీఎం ఆదేశం
– ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో 2 నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగాపెట్టుకున్నామన్న అధికారులు
– రెండు సంవత్సరాల్లోగా టౌన్‌షిప్, అనుబంధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం
– ఈ నెలాఖరులోగా సాయిల్ టెస్టింగ్, జియో టెక్నికల్ సర్వే పూర్తి చేస్తామన్న అధికారులు.
– ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్ వాల్, విద్యుత్ సరఫరా కోసం నిర్మాణపు పనులు, అలాగే ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం కరెంటు. ఆర్టీపీపీ లైన్ ద్వారా నిర్మాణ పనుల కోసం నీరు, అలాగే ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటామన్న అధికారులు.
– స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని అధికారులకు సీఎం ఆదేశం.