అది ఎంతో అందమైన అగ్నివ్ మహల్. ఉదయం వేళ రంగురంగుల పువ్వుల అందాల నడుమ సూర్యకిరణాలతో ధగధగలాడుతుంది. అప్పుడే నీలి వర్ణం చీరలో మెరుస్తూ మహల్ ప్రాంగణంలోని మెట్లపై కూర్చునేది మైరా. దగ్గర్లోని కొండల్లోంచి వచ్చే పక్షుల కిలకిలరావాలు వినేది. అవి ఎంత శ్రావ్యంగా ఉన్నా సరే ఆమె మనసు మాత్రం ఒకరి కోసం వేచి చూసేది. ఇలా కొన్ని నెలల పాటు గడిచిపోయింది. ఆమె హృదయ వేదన ఇంకా తీరలేదు.’ అని రష్మిక తన ఇన్‌స్టాలో ఓ కథ చెప్పింది. మైరాకు తనే నీలి వర్ణం చీరలో ఎవరి కోసమో నిరీక్షిస్తున్న ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఈమె సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’లో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తోంది.
రష్మిక కథలు
Related tags :