దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు భారత యువ స్టార్ స్ప్రింటర్ హిమదాస్ నామినేట్ అయింది. అసోం ప్రభుత్వం హిమ పేరును సిఫారసు చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి దులాల్ చంద్రదాస్ కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు సిఫారసు లేఖను పంపారు. దీంతో 20ఏండ్ల వయసులోనే హిమ ఖేల్‌రత్న’కు నామినేట్ అయిం ది. 2018లో అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం దక్కించుకున్న హిమ.. ఈ ఘనత సాధించిన తొలి భారత ట్రాక్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అదే ఏడాది జకార్తా ఆసియా క్రీడల్లో మహిళల 4×400 మీట ర్లు, మిక్స్‌డ్ రిలే 4×400 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు, వ్యక్తిగత 400 మీటర్ల విభాగంలో రజత పతకం దక్కించుకుంది. 2019లో కొన్ని ఈవెంట్లలో హిమ వరుసగా స్వర్ణాలు సాధించి అదరగొట్టింది. 2018లోనే హిమదాస్‌కు అర్జున అవార్డు దక్కింది.
మొన్న అర్జున. నేడు ఖేల్‌రత్న.
Related tags :