* ఏపీ రాష్ట్రంలో మరో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
* నిజామాబాద్ తెరాస ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటివ్. దీనితో తెలంగాణాలో మొత్తం సంఖ్య మూడుకు చేరింది.
* బాపట్లలో 2 నూతన కేసులకు సంబంధించిన 130 మంది ప్రైమరి & సెకండరి కాంటాక్ట్స్ ను గుర్తించి, వారి నుండి స్వాభ్ శా0పిల్స్ ను సేకరించి వైద్య పరీక్షలకు పంపించారు.
* విజయవాడ నగరంలో కబళిస్తున్న కరోనా.బీసెంట్ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో నలుగురికి కరోనా పాజిటివ్.బీసెంట్ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.సడలింపుల్లో భాగంగా ఇటీవల వస్త్ర దుకాణాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి.దీంతో బీసెంట్ రోడ్డులో భారీగా పెరిగిన రద్దీ.కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ ఆరోపణలు.పాజిటివ్ కేసు నమోదు కావడంతో బీసెంట్ రోడ్డుకు తాత్కాలికంగా బ్రేక్.జూన్ 30 వరకూ బీసెంట్ రోడ్డుకు పూర్తి లాక్ డౌన్.
* దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో రోజు 12వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏకంగా 324 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం 12,368 కొత్త కేసులు బయటపడగా.. గడచిన 24 గంటల్లో 12,156 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది.
* విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రైళ్లు, విమాన సర్వీసుల తాత్కాలిక నిలుపుదలపై జిల్లా యంత్రాంగం ఆలోచిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖకు వచ్చిన వారిలో 40 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. వీరిలో పాతిక మందికి పైగా దిల్లీ నుంచి వచ్చినవారే కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.