ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను తెలుగులో చదివారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలియజేశారు.
బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే:
వ్యవసాయానికి రూ.11,891 కోట్లు
వైఎస్‌ఆర్ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు
విద్యశాఖకు రూ.22,604 కోట్లు
వైద్య రంగానికి రూ.11,419 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు
వైఎస్‌ఆర్ గృహవసతికి రూ.3వేల కోట్లు
పీఎం ఆవాజ్ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు
పీఎం ఆవాజ్ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు
బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు
డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు
రేషన్ బియ్యానికి రూ.3వేల కోట్లు
కరోనాపై పోరులో ముందున్నాం
కరోనా సందర్భంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు
2018-19లో స్థూల ఉత్పత్తి 8శాతమే పెరిగింది
గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు సునామీలా మీద పడ్డాయి.