వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఇవే…!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం.
వ్యవసాయ రంగానికి 11 వేల 891 కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.
రైతు బరోసాకు 3615 కోట్లు కేటాయించారు.
విత్తనాల పంపిణీ కి 200 కోట్లను కేటాయించారు.
రైతులకు నష్ట పరిహారం కోసం గానూ 20 కోట్లను కేటాయించారు.
అదే విధంగా రైతు భరోసా కేంద్రాలకు గానూ వంద కోట్లు కేటాయించారు.
రైతులకు వడ్డీలేని రుణాలు 1100 కోట్లను కేటాయించారు.
నేషనల్ హార్టీ కల్చర్ మిషన్ కోసం 150 కోట్లను కేటాయించారు.
వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ లాబ్స్ కోసం గానూ 65 కోట్లను కేటాయించారు.
మత్స్యకారులకు కూడా 109 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ధరల స్థిరీకరణ నిధి కి 3 వేల కోట్లను కేటాయించారు.