కోవిడ్-19మహమ్మారి తో ప్రపంచదేశాలూ అతలాకుతలమవుతున్నాయి.
అంతేకాదు దీనిని నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేయడం వల్ల ఆర్ధిక సంక్షోభం నెలకొన్నది.
జూన్ 21న ఏర్పడనున్న సూర్యగ్రహణంతో కరోనా కు శుభం కార్డు పడనున్నదా ? ఈ గ్రహణం వల్ల మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనే సందేహాలకు పండితులు ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు.
జూన్ 21న (ఈ ఆదివారం) ఏర్పడనున్న సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం… ఈ గ్రహణ ప్రభావంతో మార్పులు రావచ్చని పండితులు ఆశిస్తున్నారు.
2019 డిసెంబర్ 26 న వచ్చిన సూర్యగ్రహణం సమయం నుంచి ప్రపంచంలో కరోనా వైరస్ మొదలైంది కాబట్టి, జూన్ 21న ఏర్పడనున్న సూర్య గ్రహణంతో కరోనా కు శుభం కార్డు పడనున్నదని జ్యోతిష్కులు ఆశిస్తున్నారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతుల ఆధారంగా భూత, భవిష్యత్ వర్తమాన కాలాలను పండితులు అంచనా వేస్తుంటారు.
గ్రహణ సమయంలో నవగ్రహాల ప్రభావం మనుషులపై ఇంకా ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.
ఇక జాతక రీత్యా కూడా ఈ గ్రహణాలు వల్ల కలిగే మంచి , చేడు ఫలితాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
ఈ సంవత్సరంలో చంద్రగ్రహణం రెండు సార్లు వచ్చింది. అతిపెద్ద సూర్యగ్రహణం జూన్ 21న ఏర్పడనుంది..
ఈ గ్రహణ సమయంలో సూర్యుడు మరింత ప్రకాశవంతంగా వెలగనున్నాడు.
ఈ సూర్యగ్రహణాన్నిప్రపంచ వ్యాప్తంగా అందరూ వీక్షించవచ్చు.
అయితే భారత్ లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ గ్రహణాన్ని చూడవచ్చు.
ఇలాంటి గ్రహణం ప్రతి 18 ఏళ్లకోసారి వస్తుంది.
సైన్స్ పరిభాషలో చెప్పాలంటే సూర్యగ్రహణం అనేది ఓ ఖగోళ ప్రక్రియ.
భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం ద్వారా సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
కొన్నిసార్లు సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు.
సూర్యుడి వెలుగును చంద్రుడు పూర్తిగా కప్పిఉంచిన కారణంగా భూమిపై చంద్రుడు నీడ మాత్రమే కనిపిస్తుంది. దీన్నే సూర్యగ్రహణం అని అంటారు.
ఇలా కేవలం అమవాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా గ్రహాలు, నక్షత్రరాశులలో మార్పులు సంభవించనున్నాయి అని అంటున్నారు జ్యోతిష్కులు.
ఈ గ్రహణంతో కరోనా మహమ్మారి ముగింపు పలకనుందని చెప్తున్నారు.
ప్రధాన దేశాలు, దేశాధినేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండవచ్చని అంటున్నారు.
అయితే ఈ గ్రహణం వల్ల వ్యాపారులకు మంచి జరుగుతుందని చెప్తున్నారు.
ఈసారి సూర్యగ్రహణం ఆదివారం రావడంతో…. వర్షం తగ్గుతుందని… ఫలితంగా గోధుమలు, వరి, ఇతర ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుందని, అదే సమయంలో ఆవు పాలు ఉత్పత్తి కూడా తగ్గుతుందని చెప్తున్నారు.