రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్ఈసీగా నియమించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ఇలా వ్యవహరించడం రాజ్యాంగ బద్ధ సంస్థలను అగౌరవపర్చటమే అవుతుందని వ్యాఖ్యానించారు.
రమేష్‌కుమార్‌ను విజయవాడ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
గవర్నర్‌గా మీరు జోక్యం చేసుకుని ఆయనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగేలా చూడాలని కోరారు.