* రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి.ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 275 కేసులు కాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 76 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,071కి చేరింది. మొత్తం 15,188 శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షించారు.
* కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సత్తెనపల్లి పట్టణంలోని ఐదు మద్యం దుకాణాలను మూసి వేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ.ఈరోజు నుండి మద్యం దుకాణాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించనున్న ఎన్ ఫోర్స్ మెంట్ స్పెషల్ బ్యూరో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు.
* కరోనాతో తమిళనాడు cm పీఏ మృతి. కరోనా వైరస్‌తో ముఖ్యమంత్రి పీఏ మృతి. తమిళనాడు సీఎం పళని స్వామి పీఏ దామోదరం ఇవాళ కోవిడ్‌తో మృతి చెందినట్లు తెలిపినా ఆ రాష్ట్ర అధికారులు.
* శ్రీకాకుళం జిల్లాలో తొలి కరోనా మరణం.జిల్లాలో 400 దాటిన కరోనా కేసులు.ఒక్క శ్రీకాకుళం పట్టణంలొనే 10 కంటైన్మెంట్ జోన్లు.271 ఆక్టీవ్ కేసులు.
* ప్రభుత్వాస్పత్రిలో పాజిటివ్..ప్రైవేటు ల్యాబ్‌లో నెగిటివ్.కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేట్ ల్యాబ్‌లకు ఏపీ ప్రభుత్వం అనుమతి.కోవిడ్ పరీక్ష ఫీజును రూ.2,900గా నిర్ణయం.కనీస ప్రమాణాలు పాటించకుండా ల్యాబ్‌ల నిర్వహణ.ప్రజల్లో నెలకొన్న ఆందోళన.ప్రభుత్వాసుపత్రి రిపోర్టులో పాజిటివ్ ప్రైవేటు ల్యాబ్ రిపోర్టులో నెగిటివ్నలుగురు వ్యక్తులకు ఇదే విధంగా రిపోర్ట్కుటుంబసభ్యుల్లో నెలకొన్న ఆందోళనఅపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఎదుట బాధితులు నిరసనల్యాబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15,188 మంది నమూనాలు పరీక్షించగా 351 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 76 ఉండగా.. రాష్ట్రంలో 275 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,071 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 90కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,906కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 2559 మంది చికిత్స పొందుతున్నారు.
* దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను పెంచుతున్న ICMR.రోజుకు మూడు లక్షల టెస్టులను లక్ష్యంగా పెట్టుకున్న ICMR.దేశవ్యాప్తంగా టెస్టింగ్ సెంటర్లను పెంచిన ICMR.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 907 టెస్టింగ్ లాబ్స్.గడిచిన 24 గంటల్లో 1,63,187 టెస్టులు.ఇప్పటి వరకు 60,84,256 టెస్టులు నిర్వహణ.ICMR భారత వైద్య పరిశోధన మండలి.