Movies

అనుష్క ఆలింగన ఆలోచన

అనుష్క ఆలింగన ఆలోచన

ప్రతి సమస్యకు పరిష్కారం చూపకపోవచ్చుచొరవతో వేసే అడుగు మనిషిలో మార్పు తెస్తుందిబాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలచివేసింది. ఈ నేపథ్యంలో అనుష్కశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ భావోద్వేగ సందేశం పోస్ట్‌ చేశారు. ‘‘మనుషులుగా పుట్టిన మనం ఎదుటివారి బాధల్ని పంచుకోవాలి. వారి మాటలు వినాలి. మనమంతా మనకు తెలిసిన విధంగా సమస్యల్ని పరిష్కరించుకుంటాం. అయితే పరిష్కరించుకునే తీరులో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. ఇది సరైన మార్గం, ఇది కాదు అంటూ ఏమీ ఉండవు. పుట్టుకతోనే మనకు రోడ్‌ మ్యాప్‌ తెలీదు. ఫలానా దారి కరెక్ట్‌ అనిపిస్తే ఆ మార్గంలో పయనిస్తాం. మానసికంగా బాధలు లేనివారు ఎవరూ ఉండరు. కొందరు పరధ్యానంలో ఉంటారు, కొందరు తమదైన మార్గాల్ని ఎంచుకుంటారు, కొందరు సాయం కోసం బయటపడి ఏడుస్తుంటారు, కొందరు లోలోపలే కుమిలిపోతుంటారు. నిస్సహాయంగా మరికొందరు ఉంటారు. మనకున్న ఈ చిన్న జీవితంలో అంతా కలిసి ఇంకా ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఎదుటివారి మాటల్ని విందాం, వారిని ప్రేమిద్దాం. మనం మనుషులం. చిన్న నవ్వు, మాటల్ని వినే గుణం, ఆప్యాయతతో కూడిన ఆలింగనం ఎదుటివారి జీవితంలో ఎంతో మార్పు తెస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం చూపలేకపోవచ్చు. కానీ చొరవతో మనం వేసే అడుగు ఎంతో మార్పును తెస్తుంది. మార్పనేది నెమ్మదిగానే మొదలవుతుంది’’ అని అనుష్క రాసుకొచ్చారు.