Health

హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్న వర్షాలు కరోనా

352 Corona Cases In Hyderabad On One Day - Rain Extra

హైదరాబాద్‌ను భారీ వర్షం కుదిపేసింది. నగరంలో గురువారం(జూన్ 18) సాయంత్రం నుంచి భారీ వర్షం దంచికొట్టింది. ఖైరతాబాద్‌, బేగంపేట, హయత్‌నగర్‌, రామంతపూర్, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, ఎల్బీ నగర్‌, కోఠిలలో వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురుగాలుకు కాలనీలలోని చెట్లు విరిగి పడ్డాయి. భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు జలమయంగా మారాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలోని చాలాచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలే ఉంటాయంటున్నారు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు. మరోవైపు, గ్రేటర్‌లో రాగల రెండురోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు

ఈ రోజు తెలంగాణలో 352 పాజిటివ్ కేసులు …3 మరణాలు.

హైదరాబాద్‌లో భయంకరంగా కరోనా కేసులు.. ఒక్కరోజే..తెలంగాణలో కరోనా ఉధృతి పెరిగింది. గురువారం పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 352 పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 195 మంది చనిపోయారు. మొత్తం 6,027 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 302 కేసులు, రంగారెడ్డిలో 17, మేడ్చల్‌లో 10, మంచిర్యాలలో 4, జనగామలో 3, వరంగల్ అర్చన్‌లో 3, భూపాలపల్లిలో 2, మహబూల్ నగర్‌లో 2, మెదక్‌లో 2, నిజామాబాద్‌లో 2, సంగారెడ్డి‌లో 2, వరంగల్ రూరల్‌, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. గురువారం 230 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3301 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2,531 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.