Fashion

మీ హైహీల్స్‌కు కూడా శానిటైజర్ ఉంది

మీ హైహీల్స్‌కు కూడా శానిటైజర్ ఉంది

మనలో చాలామంది తాము ధరించే పాదరక్షలు అందంగా ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తారు.. కానీ శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూడరు. ఈ వర్షాకాలం వాటి శుభ్రతను నిర్లక్ష్యం చేస్తే అనేక చర్మరోగాలు వస్తాయని అంటున్నారు వైద్యులు.

బయట నుంచి వచ్చీరాగానే పాదరక్షలని తీసి గాలిచొరబడని స్టాండులో పెట్టేయొద్ధు మన పాదాల చెమట వాటిలోపల పేరుకుపోయి ఫంగస్‌ విస్తరిస్తుంది. బయట గాలికి ఆరిన తర్వాత లోపల పెట్టండి.

* మార్కెట్‌లో డిస్పోజబుల్‌ వెట్‌ వైప్స్‌ దొరుకుతున్నాయి. ఎక్కడికైనా వెళ్లి వచ్చిన తరువాత ఈ వైప్స్‌తో పాదరక్షలనులోపల, వెలుపలి వైపు శుభ్రపరిస్తే వాటిపై చేరుకున్న వ్యాధికారక క్రిములు చనిపోతాయి.

* అల్ట్రా వయొలెట్‌ షూ శానిటైజర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. దీంతో చెప్పుల్లో ఉండే ఫంగస్‌, బ్యాక్టీరియా వంటివాటిని దూరం చేసుకోవచ్ఛు అలాగే ఓజోన్‌ శానిటైజర్‌ డ్రయ్యర్‌ పరికరంతో కూడా పాదరక్షలని తేలిగ్గా శుభ్రం చేసుకోవచ్ఛు