కొరియన్స్ అందుకే అందంగా ఉంటారు.. మీరూ ఈ టిప్స్ ట్రై చేయండి..
బ్యూటీఫుల్ స్కిన్ అంటే అందరికీ ఇష్టమే. అందుకోసం ఎన్నో టిప్స్ పాటిస్తారు. ముఖ్యంగా కొరియన్స్.. ఆ సీక్రెట్స్ ఏంటో మీరూ తెలుసుకోండి..
ప్రపంచంలో చాలా మంది కొరియన్స్ బ్యూటీని చూసి ఫిదా అవుతారు. ఆ లుక్ వచ్చేందుకు తాపత్రయపడుతునారు. వాళ్ళ బ్యూటీ కి కారణం మేకప్ కాదు. కేవలం ప్రాపర్ స్కిన్ కేర్. కొరియన్ స్కిన్ కేర్ అనగానే అమ్మో వాటిని నమ్మొచ్చా లేదో.. దానికి చాలా టైం పడుతుంది అనుకుంటారు. కానీ ఇది చాలా ఈజీ. ఫస్ట్ వీక్ కొంచెం టైమ్ పట్టచ్చు కానీ, ఆ తరువాత స్పీడ్ గా చేసుకుంటారు. పైగా వాళ్ళ స్కిన్ కేర్ లో సగం దాకా మనమూ చేస్తాం. కానీ, అవేంటో మనకి తెలియదు.
కొరియన్ స్కిన్ కేర్ హెల్దీ స్కిన్ మీద ఫోకస్ పెడుతుంది. మేకప్ లేకున్నా కూడా చర్మం కాంతులీనుతూ ఉండాలి. అదే కొరియన్ స్కిన్ కేర్ గోల్. ప్రతిరోజూ ఇన్ని స్టెప్స్ చేయాల్సిందేనా అని అంటే.. అవసరం లేదు. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. కానీ, స్కిన్ కి కావాల్సిన ఎస్సెన్షియల్ కేర్ ఇస్తున్నారా లేదా చూసుకోండి.
మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్
మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి. వీటిలో డబల్ క్లెన్సింగ్ లేదు. మీకు కావాలనుకుంటే ఏదైనా మైల్డ్ క్లెన్సర్ ని వాడచ్చు.
1. నీళ్ళతో ముఖం కడుక్కోండి.
నిద్ర లేచిన తరువాత నీళ్ళతో ముఖం కడుక్కోండి. ఎలాంటి క్లెన్సర్లూ వాడొద్దు. నీరు మీ స్కిన్ ని రిఫ్రెష్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది.
2. టోనర్ అప్లై చెయ్యండి
నీటితో ముఖం కడుక్కున్న తరువాత టోనర్ అప్లై చేసుకోండి. ఈ టోనర్ ని కాటన్ బాల్ మీద వేసి అప్లై చెయ్యచ్చు, లేదా మీ అరచేతులలో వేసుకుని అయినా అప్లై చెయ్యచ్చు. టోనర్ మీ స్కిన్ పీహెచ్ లెవెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. తరవాత వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్కిన్ అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది.
3. ఎస్సెన్స్ అప్లై చేయండి
ఈ ఎస్సెన్స్ సీరం, టోనర్, మాయిశ్చరైజర్ కలిపిన మిశ్రమం. కొరియన్ స్కిన్ కేర్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఇది స్కిన్ ని నరిష్ చేస్తుంది. అరచేతిలో వేసుకుని ముఖానికి అద్దండి. వేళ్ళతో రుద్దకండి.
4. యాంపూల్ అప్లై చేయండి
యాంపూల్స్ సీరం లాంటివే, కానీ వీటిలో యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి గ్లాస్ బాటిల్స్ తో డ్రాపర్ తో కలిపి లభిస్తాయి. డ్రాపర్ తో కొన్ని చుక్కలు మీ ముఖం మీద వేసి వేళ్ళతో నెమ్మదిగా అద్దండి.
5. సీరం అప్లై చేయండి..
మీ స్కిన్ కి సరిపోయే సీరం ని తీసుకోండి. ముడతలు, నల్ల మచ్చలు, డ్రై స్కిన్ వంటి సమస్యలని సీరం దూరం చేస్తుంది. అరచేతిలో వేసుకుని వేళ్ళతో నెమ్మదిగా ముఖమంతా అద్దండి.
6. ఐ క్రీం యూజ్ చేయండి
కంటి చుట్టూతా ఉండే స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది. మామూలు ఫేస్ క్రీములూ, సీరంలూ అక్కడ పని చెయ్యవు. అందుకని ఐ క్రీం వాడాలి. కొంచెం ఐ క్రీం తీసుకుని మీ వేలి చివరలతో కంటి మొదలు నించి కంటి కొస వరకూ రాయండి. కంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తపడాలి.
7. మాయిశ్చరైజర్ అప్లై చేయండి
మీ స్కిన్ టైప్ ని బట్టి మాయిశ్చరైజర్ ని ఎంచుకోండి. మాయిశ్చరైజర్ వల్లే స్కిన్ కి గ్లో వస్తుంది. ముఖం మీద మెడ మీద మాయిశ్చరైజర్ ని మసాజ్ చేస్తున్నట్లుగా రాయండి.
8. సన్ స్క్రీన్ అప్లై చేయండి
లాస్ట్ గా అప్లై చెయ్యాల్సింది సన్ స్క్రీన్. ఇది యూవీ రేస్ నించీ, సన్ టాన్ నించీ, ముడతల నించీ చర్మాన్ని ప్రొటెక్ట్ చెస్తుంది. కనీసం ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ని ఎంచుకోండి.
ఇవన్నీ డే టైమ్‌లో చేయాల్సినవి.. వీటి వల్ల స్కిన్ ఎంతో బ్రైట్, అందంగా తయారవుతుంది.