కరోనా కాలంలో అమెరికాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాట్స్ సంస్థపై ఫ్లోరిడా రాష్ట్ర టాంపాబే మేయర్ జేన్ కాస్టర్ ప్రశంసల జల్లు కురిపించారు. స్థానిక నిరుపేదలకు నాట్స్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని నాట్స్ తరపున నిత్యావసరాలు అందించారు. నాట్స్ తన వంతు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నాట్స్ బోర్డు డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఈ కార్యక్రమానికి అవేర్‌నెస్ యూఎస్ఏ, డాక్టర్ కే పిడియాట్రిక్స్, రమ్య పిన్నమనేని, విజయ్ఫణి దలై, సోమంచి కుటుంబం, సుదర్శన్రమ కామిశెట్టి, పూర్ణతార బిక్కసాని, బటర్ఫ్లై ఫార్మసీ టోనీ, టూటూ తదితరులు సహాకరించారు, నాట్స్ టెంపా బే సమన్వయకర్త రాజేశ్ కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ వాలంటీర్లు ప్రసాద్ ఆరికట్ల, సుమంత్ రామినేని, సతీశ్ పాలకుర్తి, బిందుసుధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీలు విష్ణు వీరపనేని, మురళీకృష్ణ మేడిచెర్ల తదితరులకు నాట్స్ టెంపా బే విభాగం ధన్యవాదాలు తెలిపింది.
నాట్స్ సేవలకు టెంపాబే మేయర్ ప్రశంసలు
Related tags :