Agriculture

ఆన్‌లైన్‌లో తెలుగు రైతుకు 700 ఎకరాలు

ఆన్‌లైన్‌లో తెలుగు రైతుకు 700 ఎకరాలు

పట్నాల అప్పలరాజు(62)ది విజయనగరం జిల్లా కొత్త భీమసింగి. నిరుపేద కుటుంబం. వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఆయన వృద్ధాప్య పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు పింఛను ఎందుకు రాలేదని వాకబు చేసేందుకు అప్పలరాజు గ్రామ సచివాలయానికి వెళ్లారు. ‘మీ పేరిట 700 ఎకరాలు ఉన్నట్లు ఆన్‌లైన్‌ చూపుతోంది. అందుకే పింఛను రాలేదు’ అని అక్కడి సిబ్బంది సమాధానమిచ్చారు. ఆ మాటలు విని అప్పలరాజు నివ్వెరపోయారు. ఆన్‌లైన్‌లో వచ్చిన తప్పును సరి చేయించుకునేందుకు ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ భాస్కరరావును వివరణ కోరగా… అప్పలరాజుకు భూమి లేదని నిర్ధరించామన్నారు. ఆ మేరకు ధ్రువపత్రం మంజూరు చేస్తామన్నారు.