Kids

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

Minister Adimulapu Suresh Announces No Tenth Exams In AP

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ప్రకటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

తప్పనిసరిగా పరీక్షలు చేపట్టాలని అనుకున్నాం..

పరీక్ష విధానంలో మార్పులు చేసాం.. 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నాం.

భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం.. అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నాం.

విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నాం.

కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారు.