సాంచోర్‌లోని గాయత్రి కాలేజీ సమీపంలో ఈ వింత వస్తువు పడింది. ఇది చూడ్డానికి 2.8 కిలోల బరువుందంటున్నారు. ఇది అచ్చం లోహపు ముద్దలా ఉంది. అత్యంత వేగంతో ఆకాశం నుంచి భూమి మీద పడడంతో సుమారు నాలుగు అడుగుల లోతులోకి పూరుకుపోయింది. దాన్నిముట్టుకుంటే నిప్పు పట్టుకున్నట్లు అనిపించిందని స్థానికులు వాపోయారు. ఇలాంటి లోహాన్ని ఇప్పటివరకు చూడకపోవడంతో వెంటనే అధికారులకు తెలిపారు. సమాచారం తెలియగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వస్తువును స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా గ్రహ శకలాలు భూ వాతావరణంలోకి రాగానే కలిపోవడమో లేదా గాల్లోనే కరిగిపోవడమో జరుగుతాయి. దీని విషయంలో అలా జరుగలేదు. దీని గురించి తెలుసుకోవడానికి అధికారులు పరిశోధనలకు తరలించారు.
రాజస్థాన్‌లో ఆకాశం నుండి పడిన వింత లోహపుముద్ద
Related tags :