DailyDose

పోలీసు కస్టడీకి జేసీ-నేరవార్తలు

పోలీసు కస్టడీకి జేసీ-నేరవార్తలు

* పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురు రైతన్నలను తీవ్రంగా కలిచివేసింది.

* మొన్న చైనాతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఉద్దేశంతో బజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబీ చౌరస్తాలో చైనా దిష్టిబొమ్మ దహనం చేశారు, ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఉన్న ఊరును కన్నతల్లిని భార్యా బిడ్డల్ని వదిలి పెట్టి బార్డర్ లో పనిచేస్తున్న సైనికులను చైనా దొంగ దెబ్బ తీసి చంపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని చైనా దిష్టిబొమ్మ దహనం, చైనా వస్తువుల బహిష్కరణ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామని , ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని చైనాకు దీటైన సమాధానం ఇవ్వాలని తెలిపారు,

* భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంట దాయాదికి చెందిన ఓ డ్రోన్​ను కూల్చేసింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్).

* వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగాల కేసులో పోలీసు కస్టడీకి జెసి ప్రభాకర్ రెడ్డి,ఆస్మిత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు విచారించనున్న పోలీసులు. కడప సెంట్రల్ జ్తెలు నుంచి అనంతపురంకు తీసుకురానున్న పోలీసులు.

* తాడేపల్లిలో మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వార్డు వాలంటీర్. కారులో మద్యం తరలిస్తున్న వార్డు వాలంటీర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

* మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.

* ఫిరోజాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ నుంచి అలహాబాద్​కు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది.

* ధర్మవరంలో కార్తీక్ అనే యువకుడి కిడ్నాప్ అనంతపురం కు చెందిన యువకులు కిడ్నాప్ చేసి రూ.5లక్షలు డిమాండ్ చేస్తున్నారని కార్తీక్ సోదరి పోలీసులకు ఫిర్యాదు.

* రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు మహిళ పరిస్థితి విషమం.

* జెసి ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో శనివారం ముగ్గురు జెసి వర్గీయులను అరెస్ట్‌ చేశారు. నకిలీ పత్రాలు సమర్పించి బిఎస్‌-3 వాహనాలను బిఎస్‌-4గా మార్చి రిజిస్ట్రేషన్‌ చేయించిన కేసులో నాగేశ్వర్‌రెడ్డి, సోమశేఖర్‌, రమేష్‌లను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి సహకారంతో ప్రైవేట్‌ ఆపరేటర్లకు లారీలు విక్రయించారు. నకిలీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు తయారు చేసి పోలీసుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డి, జెసి అస్మిత్‌ రెడ్డిలను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. వారిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి బెయిల్‌ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.