`తలైవి` చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి కంగనారౌనత్.. ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకుంది. దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎంజీఆర్ పాత్రలో సీనియర్ నటుడు అరవింద్‌స్వామి నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘తలైవి’ గురించి కంగనా రనౌత్ మాట్లాడుతూ, ‘‘జయలలిత మా తరహా వ్యక్తి కారు. అందం, జనాకర్షణ కలిగిన నటి. జయలలిత వంటి గొప్ప నటి, నాయకురాలి పాత్రలో నటించడం చాలా పెద్ద సవాలు. ఎందుకంటే, ఆమె అంతటి అందగత్తెను కాదు నేను. అయితే మా ఇద్దరి పోలిక ఏమిటంటే.. మేమిరువురం సినీ ఇండస్ర్టీలోకి రావడానికి సంకోచించాము. ఒక నటిని మించి తనను తాను నమ్మారు. అందువల్లే రాజకీయాల్లో విజయం సాధించారు’’ అని పేర్కొన్నారు.
జయలలిత అందం నాకు లేదు
Related tags :